ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (జీఎంఆర్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బోనాల ఉత్సవాలు ప్రజల భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్‌గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు