Sunday, 08 November 2026 06:44:21 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వికారాబాద్‌లో ఉద్రిక్తత.. ఖర్గే దిష్టిబొమ్మ దహనానికి బీజేపీ యత్నం...పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట

ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్

Date : 27 October 2026 05:11 PM Views : 104

ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి కాంగ్రెస్ పార్టీకి, ఖర్గేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ పరిణామంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు మల్లికార్జున్ ఖర్గే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నాయకుల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :