Friday, 25 September 2026 10:15:42 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

*ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బీరంగూడ గుట్టలో భక్తుల సందడి*

విశేష అభిషేకాలు.. అన్నదానానికి రూ.1 లక్ష విరాళం

Date : 13 July 2026 07:01 PM Views : 205

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సోమవారం ఆరుద్ర నక్షత్రం రావడంతో రెండో శ్రీశైలంగా పేరుగాంచిన బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ విశిష్ట సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ, తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహా రుద్రాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులందరికీ నిరంతరంగా అభిషేకాలు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు.ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం కలిసిరావడం అత్యంత పవిత్రమైన సందర్భంగా భావించి గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారని తెలిపారు. పరమశివుడికి ఈ రోజున అభిషేకం చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చినట్లు పేర్కొన్నారు.ఆలయంలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష సహకారం అందుతోందని, ఈ సందర్భంగా వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు అన్నదానం కోసం రూ.1 లక్ష విరాళం అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ధర్మకర్తల మండలి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :