ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : : కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి నగదు బ్యాగును చోరీ చేసిన నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు, సీసీఎస్ సిబ్బంది సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.9.50 లక్షల నగదుతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.రామచంద్రాపురం అశోక్ నగర్‌కు చెందిన ఎం. వెంకట రమణ (58) ఈ నెల 28న గుల్బర్గా నుంచి రూ.10 లక్షల నగదుతో హైదరాబాద్‌కు బస్సులో వస్తుండగా లింగంపల్లి వద్ద బ్యాగు కనిపించకుండా పోయింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన ఉమేష్ చవాన్ (27)ను గుర్తించి అరెస్ట్ చేశారు.ప్రయాణ సమయంలో నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీ అభినందించారు.
Admin
ప్రజా పిలుపు