Saturday, 26 September 2026 01:09:00 PM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

కేటీఆర్ జన్మదినం సందర్భంగా కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాల పంపిణీ

Date : 19 July 2026 08:51 PM Views : 103

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన "గిఫ్ట్ ఎ స్మైల్" కార్యక్రమంలో కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకుధ్రువపత్రాలు. అందజేశారు.పటాన్‌చెరు నియోజకవర్గ మహిళా నాయకురాలు పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ,పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కుట్టుశిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపాధి నైపుణ్యాలు ఎంతో అవసరమని, కుట్టు శిక్షణ వంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలు తమకు అందించిన శిక్షణ జీవనోపాధికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, రాజేష్, ఇస్నాపూర్ మున్సిపాలిటీ సహనియమిత సభ్యుడు బాబా నిజాముద్దీన్, సెయింట్ మేరీ విద్యాసంస్థల నిర్వాహకుడు విలియమ్స్, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, శిక్షణ పొందిన మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :