Friday, 25 September 2026 09:30:42 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

కాలనీవాసుల అవసరానికి స్పందన.. కొత్త కమాన్ ప్రారంభం*

రూ.1.50 లక్షలతో నిర్మాణం.. ప్రారంభించిన కాటా శ్రీనివాస్ గౌడ్

Date : 22 September 2026 04:18 PM Views : 21

ప్రజా పిలుపు / తెలంగాణ / Nalgonda : ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ ఫేజ్‌-1లో కాలనీవాసుల సహకారంతో నూతనంగా నిర్మించిన కమాన్‌ను ఆయన, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.కాలనీవాసుల కోరిక మేరకు సుమారు రూ.1.50 లక్షల వ్యయంతో ఈ కమాన్‌ను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి దాతలుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సేవా కార్యక్రమాల్లో శశిధర్ రెడ్డి ముందుండటం అభినందనీయమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఆయనను అభినందించారు. భవిష్యత్తులో మరింతగా ప్రజాసేవ చేసే అవకాశం లభించాలని ఆకాంక్షించారు.శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బీరంగూడ డివిజన్ పరిధిలో ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే, పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :