Friday, 25 September 2026 02:24:27 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలి: నీలం మధు ముదిరాజ్

ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు..ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు

Date : 18 September 2026 02:53 PM Views : 32

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : * ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశుడిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు నీలం మధుకు తీర్థప్రసాదాలు అందించి, వేద ఆశీర్వచనాలతో సత్కరించారు. ఖైరతాబాద్ బడా గణేశుడు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్న మహాగణపతి అని నీలం మధు తెలిపారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఐక్యత, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యం నెలకొనాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నీలం మధు ముదిరాజ్‌కు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్, ఫౌండర్ వీణ మాధురి, రాజశేఖర్, మొగోల్, రాజు, బాబుల్, సందీప్, రాకేష్, అభిషేక్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఎన్‌ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :