ప్రజా పిలుపు / తెలంగాణ / నల్గొండ : మిర్యాలగూడ, ఆగస్టు 26: తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా బంటు సైదులు నియమితులయ్యారు. తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీలకంఠం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీనివాస్‌ల చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని ముదిరాజ్ బీసీ సంఘం నాయకులు బంటు సైదులును ఘనంగా సన్మానించారు. అనంతరం బంటు సైదులు మాట్లాడుతూ తనపై నమ్మకంతో నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు నీలకంఠం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని ముదిరాజ్ జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, రెండు జిల్లాలకు అధ్యక్షులను, కార్యవర్గాలను ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బంటు సైదులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షుడు, బీజేపీ వన్‌టౌన్ అధ్యక్షుడు బంటు గిరి ముదిరాజ్, బీజేపీ వన్‌టౌన్ ప్రధాన కార్యదర్శి కొంగరి వెంకటరమణ, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యుడు, బీజేపీ వన్‌టౌన్ ప్రధాన కార్యదర్శి మూల రాజిరెడ్డి, రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యుడు, బీజేపీ వన్‌టౌన్ ఓబీసీ పట్టణ అధ్యక్షుడు బొట్టు సోములు ముదిరాజ్, సీనియర్ జర్నలిస్టు నక్క శీను, బీసీ సంఘం మిర్యాలగూడ పట్టణ జేఏసీ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు