Tuesday, 10 November 2026 03:51:42 PM
# యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి

ఓటర్ల జాబితా సవరణపై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి – మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్

Date : 01 July 2026 05:06 PM Views : 126

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటర్ల జాబితా ప్రత్యేక ముసాయిదా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని బాలాజీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముసాయిదా సవరణ (ఎస్‌ఐఆర్) అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా మార్పులు, చేర్పులు జరగాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే సమయంలో పొరపాట్లు జరగకుండా చూసే బాధ్యత బీఎల్‌ఏలపై కూడా ఉందన్నారు. మరణించిన వారి పేర్లు, రెండు చోట్ల నమోదైన బోగస్ ఓట్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయాలని సూచించారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితా ఖచ్చితంగా ఉండేలా బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ఈ ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించి తమ ఓటు వివరాలను సరిచూసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. సదస్సులో ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ వెన్నెల, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :