Sunday, 08 November 2026 02:38:06 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పటాన్‌చెరులోఘనంగా ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Date : 31 October 2026 01:28 PM Views : 86

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి నేపథ్యంలో నాణ్యమైన వైద్య సేవల ప్రాధాన్యత మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.పట్టణాలు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఆసుపత్రులు అందుబాటులోకి రావడం శుభపరిణామమని తెలిపారు. ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, వైద్య రంగంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి యాజమాన్యం సేవాభావంతో రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.పటాన్‌చెరు పట్టణం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ఎంతో ప్రయోజనకరమని పలువురు అభిప్రాయపడ్డారు. నూతనంగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి పటాన్‌చెరు ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, కాలనీల ప్రజలకు వైద్య సేవలందించడంలో కీలకంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్, స్థానిక నాయకులు, ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొని ప్రారంభోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :