ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : :ఇంద్రేశం మున్సిపల్ కేంద్రంలో సినిమా చిత్రీకరణ సందడి నెలకొంది. సినిమా బండి, ఈటీవీ విన్ పతాకంపై తెరకెక్కుతున్న నూతన చిత్ర షూటింగ్‌ను ఇంద్రేశంలో నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ కండ్రగుల నిర్మాతగా, ఆరే జశ్వంత్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఛాయాగ్రాహకుడిగా అక్షయ్ రామ్ పనిచేస్తున్నారు.ఈ చిత్రంలో మణి ఏగుర్ల, నేహా పటాన్, నరేంద్ర రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణతో ఇంద్రేశం పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. చిత్ర బృందం రాకతో స్థానికులు ఆసక్తిగా చిత్రీకరణను తిలకిస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు