Friday, 25 September 2026 12:21:20 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

1000 రోజుల ప్రజాపాలనపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వికాస పాదయాత్ర

Date : 06 September 2026 12:10 PM Views : 72

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు, సెప్టెంబర్‌ 6: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వికాస పాదయాత్రను ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పటాన్‌చెరు పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఉన్న గాంధీ పార్క్‌ నుంచి జాతీయ రహదారిపై అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు పాదయాత్ర కొనసాగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, బాణసంచా కాల్చి ప్రభుత్వ 1000 రోజుల పాలనను పురస్కరించుకుని విజయోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కొల్కూరి నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీలేని డ్వాక్రా రుణాలు వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, కొత్త రేషన్‌ కార్డుల జారీ, రేషన్‌ ద్వారా సన్నబియ్యం పంపిణీ, విద్యారంగంలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల ఏర్పాటుకు చర్యలు, రైతుభరోసా, వరి పంటకు బోనస్‌, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై నర్సింహారెడ్డి విమర్శలు చేశారు. అప్పటి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంపై భారీగా అప్పులు పెరిగినా రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీలు కూడా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజలు గత పాలనను, ప్రస్తుత పాలనను బేరీజు వేసుకుంటున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు కొనసాగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్‌, పట్టణ కాంగ్రెస్‌ నాయకులు రవి ముదిరాజ్‌, సాయిలు ముదిరాజ్‌, యువరాజ్‌, సిద్దు, శ్రీనివాస్‌, రాము, ఐఎన్‌టీయూసీ నాయకులు రతన్‌సింగ్‌, అంజయ్య, మల్లేష్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు అక్షిత్‌, హనుమంతు, మహేష్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకులు జ్యోతి, కల్పన, ప్రభావతి, రాణి, సంధ్య, రమ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :