Friday, 25 September 2026 10:43:30 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సురక్షా తిరంగా' కార్యక్రమంలో 350 మంది విద్యార్థులకు సూచనలు

Date : 05 August 2026 06:31 PM Views : 65

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బొల్లారం;జాగృతి దివస్ సందర్భంగా బుధవారం ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో టీజీ మోడల్ కళాశాలలో సురక్షా తిరంగా – సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస కాకూడదని, అపరిచితులు పంపే ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, క్యూ ఆర్ కోడ్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు.ఇలాంటి చర్యల వల్ల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని వివరించారు.అలాగే ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలు,పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పకూడదని, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. నకిలీ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, లాటరీలు,పెట్టుబడులు, గేమింగ్ రివార్డుల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ సహాయ కేంద్రానికి ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ సుధీర్ కుమార్, ఎస్సై అక్షిత, ఎస్సై కిష్టారెడ్డి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను సమర్థవంతంగా నివారించవచ్చని పోలీసులు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :