Monday, 09 November 2026 03:18:13 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ దంపతులు

Date : 15 September 2026 07:00 AM Views : 81

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథునికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, దంపతులు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి పుష్పాలు, పండ్లు సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు శ్రీ గణేశుడు జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజా రక్షణ కోసం పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని, వారి కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు ఎదురుకాకుండా ధైర్యం, శక్తి, మానసిక ప్రశాంతత ప్రసాదించాలని గణనాథుని ప్రార్థించినట్లు తెలిపారు.ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు నెలకొనేలా మహాగణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పరస్పర సోదరభావం, ఐక్యతతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ కోరారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ నరేందర్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ రెడ్డి, రాము నాయుడు, మహేష్ గౌడ్, నాయిముద్దీన్, సుమన్ కుమార్, ఆర్‌ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :