Friday, 25 September 2026 01:26:47 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

*బాధిత బాలికకు న్యాయం చేయాలి: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్*

Date : 18 August 2026 12:48 PM Views : 130

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటనపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్‌చార్జ్ వి.ఎస్. రాజు మాదిగ, మాదిగ మహిళా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఆలయాన్ని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తమ జాతీయ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పురోహితుడిపై చట్టప్రకారం కఠినమైన శిక్ష విధించాలని కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చిన్నారిపై ఇలాంటి దారుణ ఘటన జరగడం అత్యంత నీచమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.బాధిత బాలిక నిందితుడి మనవరాలి వయసులో ఉంటుందని, అయినప్పటికీ ఇలాంటి దారుణానికి పాల్పడటం అమానుషమని పేర్కొన్నారు. బాలికకు న్యాయం జరిగేలా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, ప్రవీణ్, రమేష్, బందేల రవికుమార్, కృష్ణ, యేసయ్యతో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :