Friday, 25 September 2026 09:30:54 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

16 మంది అరెస్ట్‌.. రూ.54,900 నగదు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం

Date : 22 September 2026 08:08 PM Views : 53

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: ముత్తంగి గ్రామంలోని రైస్‌మిల్‌ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్న 16 మందిని పటాన్‌చెరు పోలీసులు, ఎస్‌ఓటీ ఆర్‌సీ పురం పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 21న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముత్తంగి గ్రామంలోని రైస్‌మిల్‌ రోడ్డు పక్కన కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పటాన్‌చెరు పోలీసులు, ఎస్‌ఓటీ ఆర్‌సీ పురం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడ 16 మంది వ్యక్తులు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.వారిని విచారించగా నవీన్‌కుమార్, రాకేష్, కుశాల్ రాకేష్‌సింగ్, ఆకాష్, దీపక్, యాదిరెడ్డి, సాయి కృష్ణగౌడ్, డానియెల్, సాయిరామ్,రవీందర్, ప్రశాంత్, విట్టల్, దీపక్‌కుమార్ మహతో, సంతోష్‌కుమార్, భానుప్రకాష్, రాహుల్‌గా గుర్తించారు.పేకాట స్థావరం నుంచి రూ.54,900 నగదు, 14 మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన వారంతా ముత్తంగి గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :