Friday, 25 September 2026 04:29:41 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

పటాన్‌చెరులో ఘనంగా జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్‌చెరు: గూడెం మధుసూదన్ రెడ్డి

Date : 26 August 2026 03:12 PM Views : 189

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్‌చెరు నియోజకవర్గం నిలుస్తోందని బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పటాన్‌చెరు పట్టణంలో ముస్లిం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఉత్సాహంగా సాగింది.ఈ సందర్భంగా పట్టణంలోని మహాత్మా గాంధీ పార్క్ వద్ద బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డిల ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్న వారికి శీతల పానీయాలు, తాగునీరు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ప్రతి ఒక్కరూ పరమత సహనాన్ని అలవర్చుకోవాలని కోరారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు తన సొంత నిధులతో ప్రార్థనా మందిరాలను నిర్మిస్తూ, ప్రజల్లో సోదరభావం, పరమత సహనాన్ని పెంపొందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్సీ సేల్ అధ్యక్షులు కొముర గూడెం వెంకటేష్, షకీల్, సోహైల్, దస్తగిరి, సలీం, జీఎంఆర్ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :