ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : తెలంగాణ: మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషీన్లు’ పథకానికి బీసీ మహిళలు సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి.అర్హత ఉన్న మహిళలు https://tgobmms.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పథకానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సమీపంలోని బీసీ అభివృద్ధి అధికారిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.
Admin
ప్రజా పిలుపు