ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుండి పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తోంది. నర్సింగ్, మణికొండ, కోకాపేట్, గండిపేట్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, దిల్‌సుఖ్‌నగర్, సంతోష్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, నీటితో నిండిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
Admin
ప్రజా పిలుపు