Saturday, 26 September 2026 11:24:42 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

చిన్నకోడూరు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హైమావతి*

Date : 30 June 2026 09:04 PM Views : 126

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సోమవారం ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్‌లను పరిశీలించి సిబ్బంది హాజరును తనిఖీ చేశారు.మెడికల్ ఆఫీసర్, సీహెచ్‌వో-సూపర్‌వైజర్‌లు క్షేత్రస్థాయిలో పోలియో చుక్కల కార్యక్రమంలో ఉన్నట్లు సిబ్బంది తెలపడంతో, జిల్లా కలెక్టర్ వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడి నిజనిర్ధారణ చేశారు. వారు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు వివరించారు.క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే అధికారులు, సిబ్బంది ముందుగా పీహెచ్‌సీకి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసిన అనంతరమే ఫీల్డ్‌కు వెళ్లాలని, అలాగే ఫీల్డ్ వివరాలను కూడా రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు.సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన అన్ని మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు.ఈ సమాచారాన్ని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :