Thursday, 24 September 2026 08:05:27 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

రూ.1.93 కోట్లతో విద్యుత్ దీపాల ఏర్పాటు

పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 22 September 2026 04:14 PM Views : 66

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రాపురం: వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు రెండు పడక గదుల ఇళ్ల మొదటి దశ నుంచి ఉస్మాన్‌నగర్ వరకు ఉన్న ప్రధాన రహదారి మధ్యలో రూ.1.93 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ దీపాల పనులకు మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెల్లాపూర్ డివిజన్‌లో జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైన రహదారులు, మురుగునీటి కాలువలు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ప్రధాన రహదారి మధ్యలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం వల్ల రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రజలకు మెరుగైన వెలుతురు అందుతుందని, తద్వారా రహదారి మరింత సురక్షితంగా ఉండటంతో పాటు అందంగా మారుతుందని పేర్కొన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు రాములు గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, ఉప విభాగ ఇంజినీర్ కృష్ణవేణి, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :