ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమైన ప్రక్రియ అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అన్నారు. 60 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందుతున్న హోమ్‌గార్డ్ ఎల్లయ్యను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ఎల్లయ్య గత 35 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాఖకు విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ కాలంలో అందించిన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.పదవీ విరమణ అనంతరం ఎల్లయ్య తన కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఎస్పీ ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా పోలీసు శాఖ తరఫున ఎల్లయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఎల్లయ్యను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించినందుకు ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో హోమ్‌గార్డ్ కమాండెంట్ ఆర్. వెంకటేశ్వర్లు, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్‌ఐ డానియెల్, హోమ్‌గార్డ్ ప్రెసిడెంట్ జితేందర్, యాదయ్య, పదవీ విరమణ పొందిన ఎల్లయ్య కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు