Sunday, 09 August 2026 06:13:56 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన

అధికారులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

Date : 05 August 2026 06:50 PM Views : 20

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : రాష్ట్రంలోని ప్రముఖ చిన్నారులు, మహిళల వైద్య సేవలు అందించే నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, నిర్వహణ, వైద్య సేవలపై రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలోని కొన్ని విభాగాల్లో పరిశుభ్రత లోపించిందని, వైద్య సేవల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.రోగుల బంధువుల కథనం ప్రకారం, ఆసుపత్రిలోని బాత్రూమ్‌లు అపరిశుభ్రంగా ఉండటంతో రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిశుభ్రత లోపించడం వల్ల ఇన్ఫెక్షన్ల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల వద్ద ఉన్న వ్యక్తిగత దుప్పట్లు, బట్టలను ఇన్ఫెక్షన్ నివారణ చర్యల్లో భాగంగా తొలగిస్తున్నప్పటికీ, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై అదే స్థాయిలో శ్రద్ధ కనిపించడం లేదని వారు పేర్కొన్నారు.అలాగే ఉదయం వైద్యుల రౌండ్లు ముగిసిన తర్వాత అత్యవసర పరిస్థితులు మినహా ఇతర సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని కొందరు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో అవసరమైన సమయంలో వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.చిన్నారులు, గర్భిణులు అధిక సంఖ్యలో చికిత్స పొందే ఈ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని, బాత్రూమ్‌లు, వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది అందుబాటును పెంచాలని, రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రోగుల కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :