ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బొల్లారం ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీ చింతమనేని శ్రీనివాస్, ఐపీఎస్ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిరంతర పర్యవేక్షణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.పరిశ్రమలలో పనిచేస్తున్న వలస కార్మికుల వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవడంతోపాటు, వారి పూర్వ చరిత్రను (యాంటిసిడెంట్స్) సమగ్రంగా ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందని డీసీపీ వివరించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పరిశ్రమల యాజమాన్యాలు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు మాత్రమే కాకుండా వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని డీసీపీ సూచించారు.ఈ సమావేశంలో ఐడీఏ బొల్లారం సీఐ వి. సుధీర్ కుమార్, బొల్లారం ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ రావు, కార్యదర్శి రాయుడు, మైలాన్ కంపెనీ యాజమాన్య ప్రతినిధులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు