Monday, 09 November 2026 03:04:34 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రజా ప్రభుత్వంలో పేదల ముఖాల్లో చిరునవ్వులు

అభివృద్ధి, సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట

Date : 02 September 2026 07:49 PM Views : 81

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి గజ్వేల్::దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన ప్రజాసేవా స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధి–సంక్షేమాన్ని సమతుల్యంగా అమలు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని నర్సారెడ్డి పేర్కొన్నారు. ప్రజాహితం కోసం ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు పెట్టుబడి సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు, మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ రాయితీలు, పేదలకు సన్నబియ్యం పంపిణీ, సకల వసతులతో పాఠశాలల ఏర్పాటు, అర్హులకు పెన్షన్ల మంజూరు వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని నర్సారెడ్డి తెలిపారు. పేదలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగి సుఖ సంతోషాలతో జీవించేలా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ నాయకుడు నాయిని యాదగిరి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖేందర్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతిన్, మైనార్టీ సెల్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సమీర్, నాయకులు మొనగారి రాజు, రాములు గౌడ్, గుంటూకు శ్రీనివాస్, రమేష్ గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :