ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని వీఎస్పీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ పరిశ్రమలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు.బుధవారం ఉదయం సుమారు 5 గంటల నుంచి అధికారులు పరిశ్రమలోకి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. పరిశ్రమకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, రికార్డులు, కీలక పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ సోదాలు ఏ అంశానికి సంబంధించి చేపడుతున్నారనే దానిపై అధికారులు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.ఉదయం నుంచి సోదాలు నిరంతరాయంగా కొనసాగుతుండటంతో పరిశ్రమ పరిసరాల్లో ఉత్కంఠ నెలకొంది. సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Admin
ప్రజా పిలుపు