ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : 1982లో స్థాపించబడిన మైత్రి క్రికెట్ క్లబ్ నాలుగు దశాబ్దాలకు పైగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో విశేష సేవలందిస్తోంది. క్లబ్ 20వ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం సభ్యుల్లో ఆనందాన్ని నింపింది.నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా పి.హనుమంత్ రెడ్డి,ఉపాధ్యక్షుడిగా ఎన్. శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా రవీందర్ గిరి గోస్వామి, సహాయ కార్యదర్శిగా అడ్డుగారు, ప్రచార కార్యదర్శిగా ఎస్. సుమన్ లాల్, కోశాధికారిగా మునువర్ హుస్సేన్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని, క్లబ్ అభివృద్ధికి 1982 నుంచి విశేష కృషి చేసిన సీనియర్ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేసి, క్లబ్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.నూతన కార్యవర్గం సమిష్టి కృషితో మైత్రి క్రికెట్ క్లబ్ మరిన్ని విజయాలు నమోదు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలవాలని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
ప్రజా పిలుపు