Thursday, 24 September 2026 08:55:49 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

తెల్లాపూర్ రైల్వే అండర్‌పాస్‌కు రూ.21 కోట్ల మంజూరు

Date : 12 September 2026 05:16 PM Views : 40

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని తెల్లాపూర్ నుంచి విద్యుత్‌నగర్‌కు వెళ్లే మార్గంలోని రైల్వే అండర్‌పాస్ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇరుకుగా ఉన్న రైల్వే అండర్‌పాస్ కారణంగా గత 25 ఏళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ రఘునందన్ రావు చర్యలు చేపట్టారు.తెల్లాపూర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, అండర్‌పాస్ అభివృద్ధి పనుల కోసం రూ.21 కోట్ల నిధులు మంజూరు చేయించారు. నిధులు మంజూరైన నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు, మహానగర పాలక సంస్థ అధికారులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు అండర్‌పాస్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అండర్‌పాస్ విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టే సమయంలో ఇరువైపులా ఉన్న కాలనీల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.గత 25 ఏళ్లుగా ఈ మార్గంలో ఇరుకైన అండర్‌పాస్ కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారంతో తెల్లాపూర్, విద్యుత్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. పనుల సమయంలో స్థానిక ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు.రైల్వే అధికారులు, మహానగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి అండర్‌పాస్ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. రూ.21 కోట్ల నిధులు మంజూరు కావడంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :