Saturday, 26 September 2026 11:23:25 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

గడ్డిమందు సేవించి యువకుడు ఆత్మహత్య: బంగ్లా వెంకటాపూర్‌లో విషాదం

Date : 03 July 2026 07:33 PM Views : 88

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : :ఇంట్లో మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు గడ్డిమందు సేవించి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి అరవింద్ (26)ను గత ఆదివారం రోజున కుటుంబ సభ్యులు ఇంట్లో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్.. తన స్నేహితుని పొలానికి వెళ్లి అక్కడ గడ్డిమందు సేవించాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న అరవింద్ వరుసగా వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు.కొడుకు పరిస్థితిని చూసి అనుమానం వచ్చిన తల్లి గట్టిగా నిలదీయడంతో, తాను గడ్డిమందు తాగినట్లు అరవింద్ నిజం ఒప్పుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన అల్వాల్ లోని లోటస్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.మెరుగైన వైద్యం కోసం గురువారం సాయంత్రం అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అరవింద్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :