ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రాపురం :అశోక్‌నగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని 108 అంబులెన్స్ సహాయంతో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
ప్రజా పిలుపు