Thursday, 24 September 2026 09:39:26 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

అసెంబ్లీ ముందు టీషర్టు విప్పిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం.. నవీన్ రెడ్డి అరెస్ట్

Date : 07 September 2026 03:13 PM Views : 40

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించి, 1000 రోజులు గడిచినా హామీల అమలుపై సమాధానం చెప్పడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.నల్ల టీషర్టులతో అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నిరసనగా తన టీషర్టును విప్పేశారు. అయినప్పటికీ ఆయనను అసెంబ్లీలోకి అనుమతించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అనంతరం పోలీసులు నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు.ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని అన్నారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రశ్నించే గొంతులను అణచివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే నల్ల టీషర్టులతో నిరసన కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తమ నిరసనను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును కాలరాయడం సరికాదని అన్నారు.ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై ఆంక్షలు విధించడం, అరెస్టులకు పాల్పడటం ద్వారా సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :