Sunday, 08 November 2026 02:23:31 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రజావాణికి 68 దరఖాస్తులు

పెండింగ్‌ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు.. అదనపు కలెక్టర్ సంగీత

Date : 02 November 2026 04:39 PM Views : 75

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి, నవంబర్ 2: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వేగవంతంగా పరిష్కరించాలని, పెండింగ్‌ దరఖాస్తుల విషయంలో అధికారులు అలసత్వం వహించరాదని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారని, వారి సమస్యలను అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తారని, వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందని స్పష్టం చేశారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 68 దరఖాస్తులు అందాయి. వీటిలో సంగారెడ్డి నుంచి 21, నారాయణఖేడ్‌ నుంచి 3, జహీరాబాద్‌ నుంచి 2, సంగారెడ్డి కలెక్టరేట్‌లో 42 దరఖాస్తులు వచ్చాయి. అందోల్‌ డివిజన్‌ నుంచి ఎలాంటి వినతులు అందలేదని అధికారులు వెల్లడించారు.వివిధ శాఖల పరిధిలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రజావాణికి సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. దరఖాస్తుదారులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా, వారి సమస్యలకు బాధ్యతాయుతంగా పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ అఖిలేష్‌ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి జగదీష్‌, జిల్లా సంక్షేమాధికారిణి లలితకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి లలితాదేవి, డీఏహెచ్‌ఓ వసంతకుమారి, డీఎల్ఎస్ఏ అడ్వకేట్‌ తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :