Monday, 09 November 2026 03:18:43 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళి

Date : 18 August 2026 07:03 PM Views : 89

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తన కార్యాలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు, సామాజిక సమానత్వానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన గొప్ప వీరుడు పాపన్న గౌడ్ అని అన్నారు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, గౌరవం దక్కాలనే ఆశయంతో సర్వాయి పాపన్న గౌడ్ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ధైర్యం, పట్టుదల, ప్రజా సంక్షేమం పట్ల చూపిన నిబద్ధతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన సేవలు, సాగించిన పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు కృష్ణ గౌడ్, దీపక్ గౌడ్, షకీల్, వినయ్ గౌడ్, సల్మాన్, షర్పుద్దీన్, వినీత్ రెడ్డి, ఆర్బాజ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :