ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని శివానగర్ గ్రామంలో ఉన్న పల్లె దవాఖాన పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దవాఖాన ముందు, పరిసర ప్రాంతాల్లో గడ్డి విపరీతంగా పెరగడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని చెబుతున్నారు.వైద్యం కోసం దవాఖానకు వచ్చే రోగులు, ప్రజలు గడ్డి పెరగడం వల్ల దోమల బెడదను ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. రోగాలకు చికిత్స పొందేందుకు దవాఖానకు వస్తే, అపరిశుభ్రత కారణంగా దోమల బెడదతో మరో అనారోగ్య సమస్య ఎదురయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన పల్లె దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దవాఖాన ముందు, పరిసరాల్లో పెరిగిన గడ్డిని తొలగించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పల్లె దవాఖానను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని శివానగర్ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు