Saturday, 26 September 2026 12:27:29 PM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

కంది సెంట్రల్ జైలును సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

జైలు భద్రతపై సమీక్ష.. నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని ఆదేశం

Date : 17 July 2026 04:05 PM Views : 82

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కంది గ్రామంలోని సెంట్రల్ జైలును జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) పరితోష్ పంకజ్, ఐపీఎస్ శుక్రవారం సందర్శించి జైలు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్‌తో కలిసి జైలు ఆవరణ, ప్రధాన ప్రవేశ ద్వారాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ, జైలులోని ఖైదీల కదలికలు, ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద పరిణామాలు గుర్తించిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత, హానికరమైన వస్తువులు జైలు లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.జైలు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆకస్మిక తనిఖీలు తరచుగా చేపట్టాలని, సందర్శకుల తనిఖీలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించి వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. జైలు పరిసరాల్లో 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగిస్తూ సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా పర్యవేక్షించాలని, జైలు గోడలు, ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసి సెంట్రీ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని ఆదేశించారు.అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందికి క్రమం తప్పకుండా మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని, జైలు భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో పోలీసు శాఖ, జైలు శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎస్‌పీ సూచించారు.ఈ పర్యటనలో అదనపు ఎస్‌పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్, జైలు శాఖ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :