Saturday, 26 September 2026 11:23:54 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

రైతు భరోసాతో రైతులకు ఊరట

పటాన్చెరు నియోజకవర్గంలో 21 వేల మంది రైతులకు రూ.14 కోట్లు జమ

Date : 05 July 2026 09:00 PM Views : 107

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.9 వేల కోట్లు జమ చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రంగానికి అండగా నిలుస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో అప్పులపాలైన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే రూ.25 వేల కోట్లతో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గంలోనే 21 వేల మంది రైతులకు శనివారం నాటికి రూ.14 కోట్లు జమయ్యాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, కార్మిక సంఘం నాయకులు అంజయ్య, రాజు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :