ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన అనిత (30), ఆమె ఇద్దరు పిల్లలు శ్రీనివాస్ (10), ఆదిక్య (7) కనిపించడం లేదని అనిత తండ్రి స్వల్కపల్లి లింగం గౌడ్ (56) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.ఫిర్యాదు వివరాల ప్రకారం.. అక్టోబర్ 10వ తేదీ ఉదయం 11:30 గంటల సమయంలో అనిత, ఆమె భర్త అనిల్ గౌడ్ మధ్య గొడవ జరిగింది. అనంతరం అనిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల ఇళ్లలో వెతికినా వారి ఆచూకీ లభించలేదు. అనిత మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.ఈ మేరకు అక్టోబర్ 11న ఫిర్యాదు అందుకున్న నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి తల్లీ, పిల్లల ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు.అనిత, ఆమె ఇద్దరు పిల్లలు ఎక్కడైనా కనిపించినా లేదా వారి ఆచూకీ తెలిసినా వెంటనే నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్‌హెచ్‌ఓ ఏ. రంజిత్ కుమార్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Admin
ప్రజా పిలుపు