ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు విధించిన ఆంక్షల నడుమ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు”, “శక్తిలో విలీనం చేయొద్దు.. పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు కోయొద్దు” అంటూ విద్యార్థులు నినదించారు.పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి సంస్థలో విలీనం చేయాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ విద్యా సంస్థల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవద్దని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు.
Admin
ప్రజా పిలుపు