Friday, 25 September 2026 12:21:05 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

రణరంగంగా మారిన నర్సాపూర్ చౌరస్తా

పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో.. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట

Date : 18 August 2026 07:09 PM Views : 162

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనతో నర్సాపూర్ చౌరస్తా మంగళవారం రణరంగంగా మారింది. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు నూతనంగా తీసుకొచ్చిన శ్రీశక్తి విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు.సుమారు 40 నిమిషాల పాటు విద్యార్థులు మానవహారం నిర్వహించడంతో చౌరస్తాలో నాలుగు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.సమాచారం అందుకున్న ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యార్థులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆందోళన విరమించేందుకు నిరాకరించడంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులకు మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థులు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :