ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : :మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక వాహన తనిఖీల్లో భారీగా డ్రై గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి.విశ్వసనీయ సమాచారం అందడంతో నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు గురువారం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా గంజాయి చాక్లెట్లను రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 218 గ్రాముల డ్రై గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ అయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్‌పూర్ జిల్లా, పిప్రైచ్ కు చెందిన రాహుల్ (తండ్రి కమలేష్) గా గుర్తించారు.మెదక్ జిల్లా ఎక్సైజ్ అధికారి ఎల్. నరసింహారెడ్డి ఆదేశాల మేరకు, నర్సాపూర్ ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా పర్యవేక్షణలో ఈ దాడి జరిగింది. ఇందులో ఎక్సైజ్ అధికారి జ్ఞానేశ్వర్ (శిక్షణ), ఎస్‌ఐ శరత్ కుమార్, సిబ్బంది రవి, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుల్ సందీప్, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఫక్రుద్దీన్, మహేష్ పాల్గొన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు