Friday, 25 September 2026 10:39:38 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

సీఐటీయూ ఆధ్వర్యంలో 'వి.బి.జి రామ్ జీ' చట్టానికి వ్యతిరేకంగా న్యూల్యాండ్ పరిశ్రమ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు నిరసనలు*

Date : 02 July 2026 05:15 PM Views : 69

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (గ్రామీన్) వీబీ-జి రామ్ జీ చట్టం 2025'ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని న్యూల్యాండ్ పరిశ్రమ కార్మికులు గుమ్మడిదల మండల పరిధిలోని గ్రామాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎంజిఎన్ఆర్ ఈజిఏ, స్థానంలో కొత్త చట్టం రానుందన్నారు ఇది గ్రామీణ నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగిస్తుందని సీఐటీయూ, జిల్లా ఉపాధ్యక్షుడు బి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పాత ఉపాధి హామీ చట్టంలో కార్మికుల సంక్షేమం కోసం ఉన్న సౌకర్యాలను కొత్త వీబీజీ రామ్ జీ చట్టంలో పూర్తిగా తొలగించారని, కార్మికులకు నష్టం చేస్తుందన్నారు. కేంద్రం నిధులను 90% నుంచి 60%కి కుదించి, మిగతా 40% రాష్ట్రాలు భరించాలని చెప్పడం వల్ల ఉపాధి కల్పించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని విమర్శించారు. గతంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న డిజాగ్నేషన్ను మేట్ గా కుదించారని వెంటనే మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా వారినే నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఫోటో క్యాప్చరింగ్ విధానం పట్ల మండలం వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఫోటో క్యాప్చరింగ్ విధానాన్ని ఎత్తివేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి ఫోటో క్యాప్చరింగ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్ రావు, కమ్మరి రవీందర్ చారి, దేవేందర్, టి నరసింహ గౌడ్, బి గోపాల్ రెడ్డి, వైబిఆర్ వర్మ, ఎన్ రామకృష్ణ, పివి రామరాజు, వి నాగరాజు, కె నగేష్, ఎన్ నాగరాజు, పి గోవిందరావు, సతీష్ బాబు, అనూష రెడ్డి, సుంచు నర్మదా, చిన్న స్వప్న, ఇందిరమ్మ, చాపల సుధాకర్, గడ్డం లావణ్య గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :