Monday, 10 August 2026 07:58:52 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు

Date : 04 August 2026 08:07 PM Views : 37

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) సంగారెడ్డి జిల్లా శాఖ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డిని కలిసి పలువురు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.సంగారెడ్డి జిల్లా టీజీఓ శాఖ కార్యకలాపాల నిర్వహణ కోసం ఫసల్‌వాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు సంఘ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు. టీజీఓ జిల్లా శాఖ ప్రారంభం నుంచి ప్రైవేట్ భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దీంతో కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు తదితర కార్యక్రమాల నిర్వహణలో సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా, ప్రభుత్వ ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీజీఓ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు శారద, సంయుక్త కార్యదర్శి రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి వినయ్ కుమార్, కార్యవర్గ సభ్యురాలు పుష్పలతతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :