ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: సీసాల రాజు ఆధ్వర్యంలో 22వ తిరుపతి మహా పాదయాత్ర సోమవారం పటాన్‌చెరు పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. సీసాల రాజు బృందానికి చెందిన 22 మంది భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.పాదయాత్రకు ముందు పటాన్‌చెరులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తిరుపతి వైపు మహా పాదయాత్రగా బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 22 సంవత్సరాలుగా సీసాల రాజు ఆధ్వర్యంలో తిరుపతికి పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తిశ్రద్ధలతో చేపడుతున్న ఈ పాదయాత్ర లోకకల్యాణానికి మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు.అనంతరం సీసాల రాజు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో తిరుపతి పాదయాత్రను కొనసాగిస్తున్నామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో చేపట్టే ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు