ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాయరావు చెరువు పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. చెరువు పరిసరాల్లోని వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డీఆర్‌సీసీ షెడ్‌కు తరలించారు.అనంతరం వినాయక నిమజ్జనాల దృష్ట్యా చెరువు వద్ద హెల్ప్ డెస్క్, భద్రతా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ చెరుకు సాయికుమార్ మాట్లాడుతూ నిమజ్జన నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్, వైస్ చైర్ పర్సన్ వనముల బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు అంతారం సుధీర్ గౌడ్, చింతకుంట శ్రీకాంత్, మన్నె నిరంజన్ దాస్, మున్సిపల్ మేనేజర్ వైట్ల మధుసూదన్, వార్డు అధికారులు రాములు, నాగేంద్రబాబు, శానిటరీ ఇన్‌ఛార్జ్ సల్ల మురళీమోహన్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ శ్రీకాంత్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు