Thursday, 24 September 2026 11:43:16 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి

తెల్లాపూర్‌లో ఎస్‌ఐఆర్ అవగాహన ర్యాలీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 25 July 2026 10:31 AM Views : 102

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెల్లాపూర్, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే బలమైన పునాది అని, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఏలియన్స్ స్పేస్ స్టేషన్ అపార్ట్‌మెంట్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన ర్యాలీతో పాటు ప్రచార రథాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు.ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రచార రథాలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, సంక్షేమానికి ప్రతి ఓటు ఎంతో విలువైనదని, అందుకే ప్రతి అర్హుడైన ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచార రథాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :