Friday, 25 September 2026 12:21:43 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

గాంధీ ఆస్పత్రిలో రోగుల అవస్థలు

వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది చేతివాటంపై ఆరోపణలు అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి: డప్పు మల్లికార్జున్

Date : 07 September 2026 03:19 PM Views : 51

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవల తీరుపై రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆరోపించారు. రోగుల సమస్యలను అధికారులు పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గాంధీ ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి, అక్కడి నుంచి ఇంకో విభాగానికి పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మల్లికార్జున్ ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం సకాలంలో వైద్యం అందడం లేదని పేర్కొన్నారు.ఆస్పత్రిలో కొంతమంది సిబ్బంది వ్యవహారశైలిపై రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. డబ్బులు ఇస్తే పనులు త్వరగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వలేని రోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలే వైద్యం కోసం వస్తుంటారని మల్లికార్జున్ అన్నారు. అలాంటి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం వైద్యులు, సిబ్బంది బాధ్యత అని పేర్కొన్నారు. రోగులను నిర్లక్ష్యం చేయకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తే వాటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.గాంధీ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి గౌరవప్రదమైన వైద్యం, అవసరమైన సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మల్లికార్జున్ అన్నారు. రోగుల అవస్థలను పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదని, ఆస్పత్రి అధికారులు తక్షణమే స్పందించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పేద రోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :