ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామ సమీపంలోని చౌదరి చెరువులో భారీ మొసలి కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఉదయం చెరువు వద్దకు వెళ్లిన రైతులకు మొసలి ఒక్కసారిగా కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు.చెరువు కట్టపై నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు, పశువులకు నీళ్లు తాపేందుకు రైతులు, గ్రామస్తులు భయపడుతున్నారు. మొసలి సంచారంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెరువు వద్దకు చేరుకుని మొసలిని సురక్షితంగా బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు