ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తెలంగాణ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పట్టణంలోని మున్నూరుకాపు ఫంక్షన్ హాల్‌తో పాటు జేపీ కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేసి, ప్రజాస్వామ్య హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన తిరిగి స్వీకరించి, డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజశేఖర్, దేవన్న, రాజన్న, పాషా భాయ్, ఫయాజ్, విక్కీ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు