Thursday, 24 September 2026 08:55:49 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్*

Date : 09 September 2026 07:29 PM Views : 47

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వినాయక చతుర్థి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం జిల్లా కలెక్టర్ , ఎస్పీ తో కలిసి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.గణేష్ మండపాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. మండపాల వివరాలను నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలను నివారించేందుకు నాణ్యమైన విద్యుత్ వైరింగ్, తగిన భద్రతా పరికరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు.గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు క్రేన్లు, తగిన లైటింగ్, బారికేడింగ్, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు.నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేలా ప్రజలు, ముఖ్యంగా యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.నిమజ్జన కార్యక్రమంలో పోలీసుల సూచనలు, నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆవిష్కరించారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, కాలుష్య నియంత్రణ మండలి, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, మత్స్యశాఖ, నీటిపారుదల, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంగారెడ్డి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :