ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్ :బీరంగూడ డివిజన్ పరిధిలోని సాయి కృపా కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన వినాయక షెడ్డు నిర్మాణానికి శుక్రవారం ఉదయం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు బాలరాజు, మల్లేష్, కృష్ణ, ఉపేందర్ రెడ్డి, చంద్రశేఖర్, దాసు, గోపాల్, జగదీష్, ప్రమోద్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు